calender_icon.png 11 January, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ ఎయిమ్స్‌లో అండర్‌వరల్డ్ డాన్

11-01-2025 01:40:53 AM

సర్జరీ కోసం చోటారాజన్‌ను తరలించిన పోలీసులు

న్యూఢిల్లీ, జనవరి 10: తీహార్ జైల్‌లో ఖైదీగా ఉన్న అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌ను అధికారులు శుక్రవారం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. అతడికి ము క్కు సర్జరీ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు. చోటా రాజన్ అలియాస్ రా జేంద్ర సదాశివ్ నికల్జేను 2015, అక్టోబర్‌లో ఇండోనేషియా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇండియాలోని పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజన్‌ను పోలీసులు ఇండోనేషియా నుంచి ఇండియాకు ర ప్పించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు రైట్ హ్యాండ్‌గా ఉన్న రాజన్ ముప్పు ఏండ్ల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరిగాడు. 20 01లో హోటల్ వ్యాపారి జయశెట్టి హత్యకేసులో గతేడాది మేలో ముంబై స్పెషల్ కోర్టు రాజన్‌కు జీవిత ఖైదు విధించింది.