జనగామ,(విజయక్రాంతి): అండర్ వాటర్ స్విమ్మింగ్ పోటీల్లో జనగామ మండలం ఎర్రగొల్ల పహాడ్‌కు చెందిన పాలమాకుల కుమార్ అనే యువకుడు సత్తా చాటి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఫైన్ స్విమ్మింగ్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌళిలో బుధవారం జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. వీ1 కేటగిరీ(35 నుంచి 39 సంవత్సరాల వయస్సు) విభాగంలో బయో ఫిన్ 50, 100, 200 మీటర్లు, మోనో ఫిన్ 50, 100 మీటర్ల వారీగా జరిగిన ఐదు రకాల పోటీల్లో కుమార్ సత్తా చాటాడు. అన్ని కేటగిరీల్లో విజయం సాధించి ఐదు గోల్డ్‌మెడళ్లు సాధించారు. ఈయన త్వరలో జరుగనున్న అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఒకేసారి ఐదు గోల్డ్ మెడల్స్ పొంది అరుదైన రికార్డు సాధించినట్లు ఆయన తెలిపారు.