* నీటిలోనూ, భూ ఉపరితలంపై నిఘా
* 100 మీటర్ల లోతులోనూ మానిటరింగ్
* నీటి అడుగున 24 గంటలపాటు నిఘా
* తక్కువ కాంతిలోనూ పనిచేయనున్న డ్రోన్స్
ప్రయాగ్‌రాజ్, డిసెంబర్ 29: త్వరలో జరిగే మహా కుంభమేళాకు అసాధారణ భద్రతా ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. ఇందుకోసం వేల సంఖ్యలో అండ ర్ వాటర్ డ్రోన్లను నిఘా కోసం వినయోగిస్తున్నది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహా కుంభమేళాకు దాదాపు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో వారి భద్రత కోసం అండర్ వాటర్ డ్రోన్లను వాడుతున్నారు. ఈ డ్రోన్లు 100 మీటర్ల నీటి అడుగునకు కూడా వెళ్లి నిఘా వేస్తాయని అధికారులు తెలిపా రు.
అలాగే గాలిలోనూ 120 మీటర్ల ఎత్తులో డ్రోన్లు ఎగురుతూ ప్రతి అడుగును పరిశీలిం చి భద్రతను కల్పిస్తాయన్నారు. వచ్చే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమ్మేళనాల లో ఒకటైన కుంభమేళాలో అండర్ వాటర్ డ్రోన్లను మొదటిసారి వినియోగిస్తున్నారు. అలాగే యాంటీ డ్రోన్ వ్యవస్థను కూడా ఉపయోగించనున్నారు. సంగమం వద్ద స్నానం సమయంలో ప్రతి వ్యక్తికి భద్రతకు ఏర్పాటు చేస్తున్నట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది.
నీటి అడుగున 24 గంటలపాటు డ్రోన్లు ని ఘాలో పాల్గొంటాయి. తక్కువ కాంతి ఉన్నప్పుడు కూడా ఇవి ప్రభావవంతంగా పని చేస్తాయి. 100 మీటర్ల నీటి లోతులోను ఈ డ్రోన్లు పనిచేస్తూ కచ్చితమైన సమాచారం అందిస్తాయని ఓ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. దీంతో ఏదైనా ఘటన జరిగితే వెంటనే చర్య లు తీసుకోవచ్చన్నారు. అండర్ వాటర్ డ్రో న్లను ఐజీ రాజీవ్ మిశ్రా ప్రారంభించారు. అలాగే నదిలో 700 కంటే ఎక్కువ బోట్లను నిఘా కోసం ఉంచామన్నారు.
ఇవన్నీ ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ ఆధీనంలో ఉంటా యని తెలిపారు. అలాగే ఆకాశంలో యాంటీ డ్రోన్ సిస్టమ్ రాడార్‌ను ఉపయోగిస్తామన్నారు. హై రిజల్యూషన్ ఆప్టికల్ సెన్సార్లను కూడా ఉపాయోగిస్తామని చెప్పారు. భక్తుల భద్రత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం యోగీ ఆది త్యనాథ్ ఆదేశించారని పేర్కొన్నారు. కుంభమేళా భద్రతకోసం కొత్త ప్రపంచ ప్రమాణా లను ఏర్పాటు చేయాలని సీఎం కోరుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు.
డ్రోన్లతో పాటు ఏఐతో అనుసంధానించిన కెమెరాలు కూడా భక్తుల కదలికలను, రద్దీని అంచనా వేస్తాయన్నారు. అలాగే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ భద్రతను మరింత పెంచుతుందన్నారు. ఏఐ వ్యవస్థలు సాంకేతిక నేత్రాలు గా పనిచేస్తాయన్నారు. మహా కుంభమేళా లో చిన్న లోపం కూడా జరుగకుండా ఏర్పా ట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.