calender_icon.png 20 January, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ల మరమ్మతులు చేపట్టండి

13-07-2024 02:05:37 AM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి) : ఏపీలో తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైన చోట రోడ్ల మరమ్మతులకు టెండర్లను పిలవాలని కోరారు. అయితే, రాష్ట్రంలో రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.300 కోట్లు అవసరమవుతాయని చంద్రబాబుకు అధికారులు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 4,151 కిలోమీటర్ల మేర రహదారుల్లో గుంతలు ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే బాగు చేయాల్సిన రోడ్లు 2,936 కిలోమీటర్ల వరకు ఉన్నట్లు చెప్పారు. దీంతో, వీటిపై సత్వరం చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. గత వైసీపీ పాలనలో రోడ్లను నిర్లక్ష్యం చేశారని, ప్రజలు నరకం చూశారని విమర్శించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు రావొద్దని సూచించారు.