అధికారులను ఆదేశించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్
ములకలపల్లి: లో కాస్ట్ తో హై క్వాలిటీ గా మట్టి ఇటుకలతో ప్రహరీల నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు తయారుచేసి స్థానిక కూలీలకు ఉపాధి కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు అంచనాల రూపొందించి కలెక్టర్కు నివేదిక అందించారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించి స్థానికంగానే మట్టితో, స్థానిక కూలీలతో తయారు చేయించి ప్రహరీ గోడ నిర్మించేలా చెయ్యాలని, మోడల్ గా ములకలపల్లి మండలంలో ప్రయోగాత్మకంగా పనులు చేపట్టి నిర్వహించాలని పి ఆర్ ఈ ఈ శ్రీనివాస్ ని కలెక్టర్ ఆదేశించారు. ఇది సక్సెస్ అయితే జిల్లాలోని అన్ని పాఠశాలలకు ప్రహరీ గోడలు మట్టి ఇటుకలతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.