calender_icon.png 15 November, 2024 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర దర్యాప్తు చేపట్టండి

13-11-2024 01:26:17 AM

  1. అధికారులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి 
  2. డీజీపీని కలిసి విజ్ఞప్తి చేసిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ

హైదరాబాద్, నవంబర్ 12 (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ జితేందర్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి నేతృత్వంలో బృందం మంగళవారం డీజేపీకి వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. అధికారులపై భౌతిక దాడులకు దిగి, గాయపర్చినప్పుడు స్పందించని నాయకులు.. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేస్తే ఖండించడమేంటని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంపై గ్రామంలో ప్రజాభిప్రాయసేక రణకు వెళ్లిన కలెక్టర్, అదనపు కలెక్టర్, కడా ప్రత్యేక అధికారి, తహసీల్దార్, ఇతర అధికారులపై రైతుల ముసుగులో కొందరు పథకం ప్రకారమే దాడి చేసినట్టుగా కనిపి స్తోందని అన్నారు.

దాడి చేసిన వారిని, వారి వెనుకాల ఉన్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. జేఏసీ నాయకులు కే రామకృష్ణ, ఎస్ రాములు, రమేశ్ రాపాక, సెక్రటరీ జనరల్ పూల్‌సింగ్ చౌహాన్, రాధ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.