calender_icon.png 19 April, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

21న పొంగులేటి పర్యటన

19-04-2025 06:56:02 PM

భూ భారతి చట్టంపై అవగాహన..

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై ఈనెల 21న జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు(District Congress Party President Kokkirala Vishwa Prasad Rao) శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.