హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 10 (విజయక్రాంతి): హెచ్ వైరస్ కొత్తదేమీ కాదనీ.. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఆస్టర్ ప్రైమ్ దవాఖానకు చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రత్నబాబు తెలిపారు. యూసుఫ్‌గూడ పోలీస్ బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న 300 మంది పోలీసులకు డాక్టర్ రత్నబాబు శుక్రవారం హెచ్‌ఎంపీవీ వైరస్‌పై అవగాహన కల్పించారు.
గొంతులో ఇబ్బంది, దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ లక్షణాలు మాత్ర ఈ వైరస్ ద్వారా వ్యాపిస్తాయన్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, చిన్న పిల్లలకు సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ కల్యాణి, కమాండెంట్ మురళీకృష్ణ, అడిషనల్ కమాండెంట్ నరేంద్రసింగ్, బెటాలియన్‌కు చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.