calender_icon.png 27 February, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం

26-02-2025 12:35:15 AM

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 2 కే రన్ లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ క్రీడ జ్యోతి ని వెలిగించి 2 కే రన్ ను ప్రారంభించారు.

బ్యాంక్ ల ఆర్థిక అక్షరాస్యత పై ప్రతి ఒక్కరు అవగాహాన కల్గి ఉండాలని ప్రత్యేకంగా మహిళలు, యువత సంపూర్ణ అవగాహన కలిగి పోదుపుతో పాటు బ్యాంక్ ల ద్వారా అర్థిక స్వావలంభనాన్ని పొంది తమ తమ కుటుంభ అర్థిక స్థితిగతులను మెరుగు పరుచుకోవాలని కలెక్టర్ సూచించారు.

మహిళలు ఆర్థిక అభివృద్ధి సాంధించేల బ్యాంక్ రుణాలు అందించాలన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించే ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల నేపథ్యంలో చేపట్టే కార్యక్రమాల గురించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎల్.డి.ఎం ఉత్పల్ కుమార్, టి.జి.బి రీజనల్ మెనెజర్ ప్రభుదాస్, క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్ ఉన్నారు.