calender_icon.png 24 November, 2024 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుద్ధప్రాతిపదికన భూగర్భ సంపులు నిర్మించాలి

24-11-2024 12:09:27 AM

ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిశోర్ ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23 (విజయక్రాంతి): గ్రేటర్ పరిధిలో నిర్మాణంలో ఉన్న భూగర్భ సంపులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిశోర్ జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

ఖైరతాబాద్ జోన్ పరిధిలోని రాజ్ భవన్ రోడ్‌లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ప్రవేశ మార్గంలో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా నిర్మిస్తున్న భూగర్భ సంపు పనుల పురోగతిని శనివారం దానకిశోర్ హెచ్‌ఎండీఏ, జలమం డలి, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షపునీటిని ఒడిసి పట్టడం ద్వారా రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా సంపులను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

నిర్మాణంలో ఉన్న సంపులను సత్వరమే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో 10 నుంచి 40 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్రయోగత్మకంగా 123 చోట్ల భూగర్భ సంపుల నిర్మాణ పనులు చేపట్టగా.. అందులో 4 పూర్తి అయినట్టు వెల్లడించారు.