calender_icon.png 4 February, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్టుగా గంజాయి దందా

04-02-2025 12:08:25 AM

యువతా.. గంజాయి మత్తు వదలరాదా ?

తిమ్మాపూర్, ఫిబ్రవరి 3: గంజాయి మత్తుకు బానిసలై యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. గంజాయి వాడ కాన్ని కాలేజీ స్టూడెంట్స్ ఫ్యాషన్ గా అలవా టు చేసుకుని ఆ మత్తులో మునిగి తేలుతు న్నారు. యువతకు విచ్చలవిడిగా లభిస్తున్న మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితా లను నాశనం చేసుకుంటున్నారు.

పలు గ్రామాల్లో కూడా గంజాయి గుట్టు చప్పుడు కాకుండా సరఫరా అవుతూ గప్ చుప్ లా లభిస్తున్నట్లు తెలుస్తోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా గంజాయిని మోతాదుకు మించి వినియోగించడం వల్ల తమ ప్రాణా లపై తీసుకొచ్చుకుంటున్నరు.మైనర్లు సైతం దీనికి బానిసరవుతూ దాడులకు పాల్పడు తున్న ఘటనలు కోకొల్లలు..

పిల్లలు తమ కళ్ళముందే ఎంజాయ్ కి బానిసై వింత వింత చేష్టలతో ప్రవర్తిస్తుండడంతో తల్లిదం డ్రులు ఆందోళన చెందుతున్నారు. కళాశాల లో చదువుకుంటున్న యువత దానికోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారంటేనే గంజాయికి ఎంతగా బానిసలు అవుతున్నా రో స్పష్టమవుతుంది. మత్తుకు అలవాటు పడి కొందరు డబ్బు సంపాదన కోసం..

మరికొందరు నేరాలకు పాల్పడుతున్నారు. కరీంనగర్ జిల్లా ప్రాంతంలోని సమీపంలో గల పలు కళాశాలలో ప్రాంతాలలో గంజా యి వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. మైనర్లు సైతం మహమ్మారి గంజాయికి బానిసలు అవుతున్నారని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవి ష్యత్తు తరాలకు బాటలు వేయాల్సిన యువ త చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. 

కళాశాలలో చదువుకునే విద్యార్థులు తమ చెడు అలవాటులకు బానిసలై తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందని దురాశతో కొందరు యువత గంజాయి అక్రమ రవాణాకు పెడదోవ పడుతున్నారు. ఫ్రెండ్స్ సహకారాలతో బయట నుంచి తెచ్చిన గంజాయిని చిన్నచిన్న పొట్లలలో కట్టి కావలసిన వారికి విక్రయిస్తున్నారు. కొంతమంది యువకులు మాత్రం మత్తులో మునిగితేరుతున్నారు.

సుమారు ఒక పొట్లం 1000 నుంచి 2000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. పట్టణానికి సమీ పంలో కళాశాలలో చదువుకుంటున్న స్నేహి తులు హైదరాబాదు, విజయవాడ, ఖమ్మం, ఆదిలాబాద్, మహారాష్ర్ట, ప్రాంతాలలో ఉన్నటువంటి స్నేహితుల సహకారంతో గంజాయిని తెప్పించుకొని స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నారు. 

తిమ్మాపూర్ పోలీస్ డివిజన్ స్థాయిలో గత ఏడాది ఎల్‌ఎండి లో మూడు కేసులు నమోదయ్యాయి. చిగురు మామిడిలో కూడా ఒక కేసు నమోదు కాగా గన్నేరువరంలో వాహనాలను తనిఖీలు  చేపడుతుండగా ద్విచక్ర వాహనంతో పాటు గంజాయి స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. 

ప్రత్యేక దష్టిని సారిస్తాం 

తిమ్మాపూర్ మండల సర్కిల్ పరిధి లో గల కళాశాలలో గ్రామీణ ప్రాంతా లలో కూడలిలపై ప్రత్యేక దష్టిని పెడ తాం. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తు న్నారని తమకు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి తగు చర్యలు తీసుకుంటాం. ఇకపై గంజాయి నియంత్రణ ప్రధాన లక్ష్యంగా పలు గ్రా మాలలో కళాశాలలో అవగాహన కల్పిం చి మత్తు భారీ నుంచి బంగారు భవిష్య త్తుగా తీర్చిదిద్దుకునేలా అడ్డుకట్ట వేస్తాం. వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపట్టి నియత్రిస్తాం.

 తిమ్మాపూర్ సిఐ కర్ర స్వామి