calender_icon.png 25 September, 2024 | 6:04 PM

బీఆర్‌ఎస్ పాలనలో వ్యవసాయం, విద్యారంగం నిర్వీర్యం

24-09-2024 01:10:00 AM

ప్రొఫెసర్ హరగోపాల్ 

హనుమకొండ, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో వ్యవసాయ, విద్యారంగాలు నిర్వీర్యం అయ్యాయని రిటైర్డ్ ప్రొఫెసర్ జి హరగోపాల్ విమర్శించారు. సోమవారం హనుమకొండ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ద కాలంలో అభివృద్ధి సవాళ్లు అంశ ంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. 90 శాతం మంది చిన్నసన్న కారు రైతులే ఉన్నందున సాగులో లాభసాటి కోసం విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో ప్రశ్నించే తత్వం పెరగాలన్నారు. నాణ్యమైన రాజకీయాలు కావాలన్నారు.