calender_icon.png 7 November, 2024 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పృథ్వీరాజ్ సారథ్యంలో

19-06-2024 12:15:28 AM

న్యూఢిల్లీ: భారత సీనియర్ షూటర్ పృథ్వీరాజ్ తొండైమాన్ సారథ్యంలో భారత జట్టు షాట్ గన్ విభాగంలో ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ ఆడనుంది. మంగళవారం భారత షూటింగ్ సమాఖ్య(ఎన్‌ఆర్‌ఐఏ) షాట్ గన్ విభాగం నుంచి ఐదుగురితో కూడిన బృందాన్ని ఒలింపిక్స్‌కు ఎంపిక చేసింది. పృథ్వీరాజ్ తో పాటు రాజేశ్వరీ కుమారి, అనంత్‌జీత్ సింగ్, రయిజా డిల్లాన్, మహేశ్వరీ చౌహాన్‌లు జట్టులో ఉన్నారు. మెన్స్ ట్రాప్ విభాగం నుంచి పృథ్వీరాజ్ బరిలో ఉండగా.. మహిళల ట్రాప్ ఈవెంట్‌లో రాజేశ్వరీ కుమారీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఇక పురుషుల స్కీట్ విభాగంలో అనంత్ జీత్ ఒక్కడే పాల్గొననుండగా.. మహిళల స్కీట్ విభాగంలో రయిజా డిల్లాన్, మహేశ్వరీలు పోటీ పడనున్నారు. ఇక అనంత్ జీత్, మహేశ్వరీ చౌహాన్‌లు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ పోటీకి సిద్ధమయ్యారు. అయితే ఈ ఐదుగురికి ఇదే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం. మరో భారత షూటర్ శ్రేయాసి సింగ్ పేరును ఐఎస్‌ఎస్‌ఎఫ్‌కు పంపించామనిఎన్‌ఆర్‌ఐఏ తెలిపింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ నుంచి అనుమతి రాగానే శ్రేయాసి సింగ్ ఎంపికను పరిశీలిస్తామని పేర్కొంది. కాగా రైఫిల్, పిస్టల్ విభాగం కలిపి 21 మంది షూటర్లను ఎన్‌ఆర్‌ఐఏ పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా భారత్ నుంచి ఈసారి అత్యధికంగా 25 మంది షూటర్లు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించనున్నారు.