calender_icon.png 8 January, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంధాన సారధ్యంలో

07-01-2025 01:20:24 AM

  • ఐర్లాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు
  • హర్మన్, రేణుకకు విశ్రాంతి

న్యూఢిల్లీ: స్వదేశం లో వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సా హంలో ఉన్న భారత మహిళల జట్టు ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. జనవరి 10 నుంచి జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ సోమవారం జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు పేసర్ రేణుకా సింగ్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు.

హర్మన్ స్థానంలో స్మృతి మంధాన నాయకత్వ బాధ్యతలు చేపట్టనుంది. 35 ఏళ్ల హర్మన్‌పై అధిక బారం పడకూడదనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ ఈ సిరీస్‌కు మినహాయింపు ఇచ్చింది. కొన్నాళ్లుగా స్థిరంగా రాణిస్తున్న రేణుకా సింగ్‌కు కూడా తగిన విశ్రాంతి అవసరమని భావించింది. వీరిద్దరి స్థానంలో మిన్నూ మానీ, సయాలీ సత్‌గర్హే తుది జట్టులోకి వచ్చారు. సిరీస్‌లో భాగంగా జరగనున్న మూడు వన్డేలకు రాజ్‌కోట్ ఆతిథ్యమివ్వనుంది. తొలి వన్డే జనవరి 10న, రెండో వన్డే 12న, మూడో వన్డే 15న జరగనున్నాయి.