calender_icon.png 15 January, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిన్స్ సారధ్యంలో

14-01-2025 12:08:24 AM

చాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్ జట్టు ప్రకటన హాజిల్‌వుడ్, మార్ష్‌కు చోటు

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), అలెక్స్ కేరీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హర్డీ, హాజిల్ వుడ్, హెడ్, జోస్ ఇంగ్లిస్, లబుషేన్, స్టీవ్ స్మిత్, మార్ష్, మ్యాక్స్‌వెల్, షార్ట్, ఆడమ్ జంపా, మార్కస్ స్టోయినిస్, స్టార్క్.

సిడ్నీ: వచ్చే నెల పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి వన్డే చాంపియన్స్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను ఏంచుకున్న ఆస్ట్రేలియా గాయాలతో ఇబ్బంది పడుతున్న హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్‌లకు చోటు కల్పించడం విశేషం. చీలమండ గాయంతో బాధపడుతూనే బోర్డర్ గావస్కర్ సిరీస్ ఆడిన కమిన్స్‌ను లంకతో సిరీస్‌కు ఎంపిక చేయలేదు.

చాంపియన్స్ ట్రోఫీ వరకు కమిన్స్ కోలుకునే అవకాశం ఉండడంతో అతడిని ఎంపిక చేసినట్లు సీఏ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలిపాడు. జట్టులో ఆల్‌రౌండర్లకు పెద్ద పీట వేసిన ఆస్ట్రేలియా స్టోయినిస్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేసర్ మెక్‌గుర్క్,  మ్యాక్స్‌వెల్‌లకు చోటు కల్పించింది. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఉన్న ఆస్ట్రేలియా అఫ్గానిస్థాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలతో మ్యాచ్‌లు ఆడనుంది. ఆస్ట్రేలియా జట్టు చివరగా 2009లో చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.