calender_icon.png 17 November, 2024 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుమ్రా సారథ్యంలో

12-11-2024 12:00:00 AM

ఆసీస్ బయల్దేరిన టీమిండియా  నవంబర్ 26 నుంచి తొలి టెస్టు

ముంబై: ప్రతిష్ఠాత్మక బోర్డర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టుకు భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యం వహించే అవకాశముంది. వ్యక్తిగత కారణాలతో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త ఆలస్యంగా జట్టుతో కలవనున్నాడు. ఈ విషయాన్ని భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ధ్రువీకరించాడు. నవంబర్ 26 నుంచి మొదలుకానున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు టీమిండియా మొదటి బృందం ఆదివారం అర్థరాత్రి బయల్దేరి వెళ్లింది. ఆసీస్ పర్యటనకు ముందు గంభీర్ మీడియాతో మాట్లాడాడు.

తొలి టెస్టుకు రోహిత్ దూరం!

‘ఆసీస్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు జట్టు మొదటి బృందం బయల్దేరి వెళ్లింది.  ఇవాళ రెండో బృందంతో కలిసి నేను ఆసీస్‌కు వెళ్లనున్నా. వ్యక్తిగత కారణాలతో రోహిత్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న బుమ్రా మొదటి టెస్టుకు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నాడు. అయితే రోహిత్ ఆడే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ తొలి టెస్టుకు రోహిత్ దూరమైతే ఓపెనింగ్ ఎవరు చేస్తారనే దానిపై ఆందోళన లేదు.

జైస్వాల్‌కు జతగా కేఎల్ రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్‌ను పంపించే ప్రయత్నం చేస్తాం.  ఆస్ట్రేలియాొోఏతో జరిగిన అనధికారిక టెస్టులో రాహుల్‌తో పాటు ఈశ్వరన్ ఆడాడు. గిల్‌ను ఓపెనర్‌గా పంపే యోచనలో ఉన్నాం. అయితే రాహుల్ ఓపెనింగ్ నుంచి ఆరో స్థానం వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయడంలో సమర్థుడు. ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు. ఆల్‌రౌండర్ శార్దూల్‌కు కూడా ఇదే వర్తిస్తుంది.

గతంలో ఆసీస్ పర్యటనలో ఆడిన అనుభవం అతనికి ఉండడం సానుకూలాంశం. స్వదేశంలో న్యూజిలాండ్‌కు టెస్టు సిరీస్ కోల్పోవడం పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మన పిచ్‌లతో పోలిస్తే ఆస్ట్రేలియా పిచ్‌లు విభిన్నం. ఇక్కడ విఫలమైన కోహ్లీ, రోహిత్, సిరాజ్‌లు ఆసీస్‌లో రాణించే అవకాశముంది. ధ్రువ్ జురేల్, సుందర్ కూడా ఆసీస్ పర్యటనలో కీలకం కానున్నారు’ అని గంభీర్ పేర్కొన్నాడు.