భారత్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన
పల్లెకెలె: టీమిండియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు శ్రీలంక కెప్టెన్‌గా చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం లంక క్రికెట్ బోర్డు మంగళవారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ అనంతరం వణిండు హసరంగ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్‌తో టీ20 సిరీస్‌కు లంక బోర్డు అసలంకను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఆల్‌రౌండర్లు మాథ్యూస్, ధనుజంయ డిసిల్వా, వికెట్ కీపర్ సదీరా సమరవిక్రమ, పేసర్ మధుషనకలకు బోర్డు మొండిచేయి చూపింది. కాగా సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకలో అడుగుపెట్టింది. శనివారం ఇరుజట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.