ఉచిత వైద్య పరీక్షలు, హెల్త్ కార్డుల పంపిణీ
కరీంనగర్, జనవరి 29 (విజయ క్రాంతి): నగరంలోని 59వ డివిజన్ జ్యోతి నగర్ లో తెలంగాణ భవన నిర్మాణ, అనుబంధ కార్మికులు, సంఘటిత కార్మికులకు అదరణ సేవా సమితి సంక్షేమ మండలి ఆధ్వర్యంలో బుధవారం 121 రకాల ఉచిత వైద్య పరీక్షలు చేసి, హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రెపావని రవి మాట్లాడుతూ 59వ డివిజన్లో ఉన్న ప్రజలలో చాలా మంది కూలీ పని చేసుకుని జీవనోపాధి పొందే వారే ఎక్కువ ఉన్నారని, వారు నిత్యం సిమెంట్ పని చేస్తు దుమ్ము లో ఉంటారని వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకుండా పొట్ట తిప్పల కోసం పని చేస్తారని వారి ఆరోగ్యమే కాపడం కోసం మా సంస్థ ద్వారా లేబర్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయించామన్నారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ట్రైనింగ్ ఫ్యాకల్టీ వెంకటేష్, రవీందర్, లేబోటమిస్ట్ సాయి అభిషేక్, పవన్, సంస్థ సభ్యులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.