calender_icon.png 11 January, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే స్టేషన్ నిర్మాణ పనుల్లో ఘోర ప్రమాదం

11-01-2025 04:41:13 PM

కాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కన్నౌజ్ రైల్వే స్టేషన్‌(Kannauj railway station)లో శనివారం నిర్మాణంలో ఉన్న భవనం సీలింగ్ స్లాబ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. దాదాపు 30  కార్మికులు, రైల్వే సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు శిథిలాల కింద నుంచి ఆరుగురిని రక్షించామని అధికారులు తెలిపారు. అమృత్ భారత్ పథకం(Amrit Bharat Station Scheme) కింద స్టేషన్‌ను పునరుద్ధరించడంతోపాటు రెండంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. తెల్లవారుజామున సీలింగ్‌ స్లాబ్‌ వేసే పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. సంఘటన తర్వాత, భయాందోళనలు చోటుచేసుకున్నాయి, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ భారీ శిధిలాల కారణంగా సహాయం చేయలేకపోయారు. SDRF, GRP, RPF స్థానిక పోలీసుల బృందాలు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.