calender_icon.png 16 November, 2024 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పాలనలో హాస్టళ్లు నిర్వీర్యం

04-11-2024 12:34:13 AM

  1. మెస్ చార్జీలు ఒక్క రూపాయి పెంచలేదు
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  3. గడ్డిపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన

హుజూర్‌నగర్, నవంబర్ 3: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేశారని, విద్యార్థుల మెస్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

ఆదివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మం డలంలోని గడ్డిపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో వసతులు కల్పించనున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. గత ప్రభుత్వం రెసిడెన్షి యల్ పాఠశాలలకు రూ.70 కోట్లు కేటాయి స్తే, తమ ప్రభుత్వం ఒకే ఏడాది రూ.5వేల కోట్లు కేటాయించిందని అన్నారు.

రాష్ట్ర సంప ద ప్రజలకు ఉపయోగపడాలని, పాలకులు పంచుకోవడానికి కాదన్నారు. పది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఒక్క కిలోమీటరు తవ్వలేదన్నారు. 20 నెలల్లోనే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన సృష్టం చేశారు.

దేశంలోనే నంబర్ వన్ చేస్తా

హుజుర్‌నగర్ నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 150లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్ల ద్వారా సేకరించి మద్దతు ధర అందించేందుకు కృషి చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ తరువాత తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యాన్ని అందించనున్నట్లు తెలిపారు. 

నిజాయతీకి నిదర్శనం మంత్రి ఉత్తమ్ 

నీతి, నిజాయతీ, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొనియాడారు. ఐదుగురు ఎమ్మెల్యేలతో ప్రతిపక్షనేతగా ఉండి, ప్రజా సమస్య లపై పోరాటం చేసి అనంతరం ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రమంతటా పాదయాత్ర చేపట్టారన్నారు.

రూ.7లక్షల కోట్లు అప్పులు చేసి నాయకుడు ఫామ్‌హౌస్‌లో పడుకుని ఉంటే డిప్యూటీ సీఎం భట్టి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడని అన్నారు. గరిడేపల్లి నుంచి సూర్యాపేట రహదారిని డబుల్‌రోడ్డుగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం హుజూర్‌నగర్ పరిధిలోని ఫణిగిరి రామస్వామి గుట్ట వద్ద మోడల్ కాలనీ లో నిర్మిస్తున్న 2,160 ఇండ్లను డిప్యూటీ సీఎం, మంత్రులు పరిశీలించారు.