హైదరాబాద్: నేటి నుంచి జనవరి 10 వరకు ఆల్ ఇండియా జూనియర్ అండర్ 19 ర్యాంకింగ్ బాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా పోటీల్లో రాష్ట్ర, అంతర్ రాష్ట్రాలకు చెందిన సుమారు 1500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.
ఈ నెల 7న మెయిన్ డ్రా పోటీలను ముఖ్య అతిథులుగా హాజరుకానున్న ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, బాడ్మింటన్ చీప్ కోచ్ పుల్లెల గోపిచంద్, టీజీవో అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించనున్నారు.