calender_icon.png 24 January, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ

07-12-2024 02:54:25 AM

* సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ఒకవైపు ప్రజాపాలన విజయోత్స వాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ర్టంలో సీఎం రేవంత్ అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎక్స్‌వేదికగా ఆయన స్పందిస్తూ.. తమ పార్టీ ఎమ్మెల్యే లు, నేతల అరెస్టులకు నిరసనగా ట్యాంక్‌బండ్ వద్ద ధర్నాకు పిలుపునిస్తే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్లనివ్వకుండా నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. నిరంకుశ, నియంతృత్వ పాలనకు ఈ ప్రభుత్వం నిలువుటద్దమని సీఎంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వ వైఖరిని చూసి హైదరా బాద్ నడిగడ్డపై ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నాడన్నారు. అదుపులోకి తీసుకున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ఆంక్షలు సరికాదు: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి 

రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించడానికి ప్రభుత్వం ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఇది ప్రజా ప్రభుత్వమా, ప్రజలను హింసించే ప్రభుత్వామా? అంటూ నిలదీశారు. రాజ్యాంగాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్‌గాంధీకి.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాయడం కనిపిస్తలేదా? అంటూ మండిపడ్డారు.