calender_icon.png 6 February, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగుకు యోగ్యంగా లేని భూములను గుర్తించాలి

17-01-2025 04:38:04 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి (విజయక్రాంతి): సాగుకు యోగ్యం లేని భూములను గుర్తించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అన్నారు. శుక్రవారం సదాశివ నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో కొద్ది సేపు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల సర్వే, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలపై చర్చించారు. 100 శాతం సర్వే చేయాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 955 లోని 19 గుంటల ఐదుగురు రైతులకు సంబంధించిన భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల మధ్యలో ఉన్న భూమి గతంలో గాని ప్రస్తుతం గాని సాగుకు యోగ్యంగా లేని భూమికి గతంలో రైతు భరోసా మంజూరు చేశారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయానికి యోగ్యంగా లేదని అధికారులు ద్రువపరిచారు.

ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న కుటుంబం యొక్క వివరాలను సర్వే చేసిన తీరును కలెక్టర్ పరిశీలించారు. సర్వే పక్కాగా నిర్వహించాలని, అర్హత కలిగిన కుటుంబాలకు లబ్ధి కలిగేలా సర్వే చేపట్టాలని తెలిపారు. అనంతరం సదాశివ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రిలో వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వైద్య చికిత్సలు అందించాలని అన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఔషదాలు ర్యాక్ లో ఏర్పాటుచేయాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్ మాట్లాడి, వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగారు. ఆసుపత్రిలోని వాక్సినేషన్, స్టోర్ రూం, లేబర్ రూం, వార్డ్స, లను కలెక్టర్ పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జడ్పీ సీఈవో చందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్రశేఖర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, తహసీల్దార్ గంగాసాగర్, ఎంపీడీఓ సంతోష్, మెడికల్ ఆఫీసర్ ఆస్మా అఫ్షీమ్, వ్యవసాయ, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.