జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్...
కామారెడ్డి (విజయక్రాంతి): సాగుకు యోగ్యంగా లేని భూములను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అన్నారు. గురువారం తాడ్వాయి మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 107 లోని భూములను అధికారులతో కలిసి పరిశీలించారు. సాగుకు యోగ్యంగా లేని భూముల వివరాలకై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వివరాలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిన మేరకు అధికారులు క్షేత్ర స్థాయిలోని భూములను పరిశీలించడం జరుగుతున్నదని తెలిపారు. గత రికార్డుల ఆధారంగా వ్యవసాయానికి అనువుగా లేని భూముల వివరాలు ఈ నెల 20 లోగా పరిశీలన బృందాలు పరిశీలిస్తారని తెలిపారు. ఆయా క్షేత్ర స్థాయిలో పరిశీలన బృందాల పనితీరును మండల స్థాయిలో తహసీల్దార్లు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ లు పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ రంగనాథ్ రావు, తహసీల్దార్ రహీముద్దీన్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.