calender_icon.png 24 March, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్క్యులర్‌ను వెనక్కి తీసుకునేంత వరకు రాజీలేని పోరాటం

22-03-2025 11:50:09 PM

ఏబీవీపీ...

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు సర్క్యులర్‌ను వెనక్కి తీసుకునేంత వరకు రాజీలేని పోరాటం చేస్తామని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్, రాష్ట్ర నాయకులు అలివేలు రాజు, కమల్ సురేష్, ఓయూ అధ్యక్ష, కార్యదర్శులు దృహన్, శివశంకర్ అన్నారు. శనివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అప్రజాస్వామికంగా జారీ చేసిన సర్క్యులర్‌కు వ్యతిరేకంగా యూనివర్సిటీలో సంతకాల సేకరణ చేశామని, 4,731మంది విద్యార్థులు, 96మంది అధ్యాపకులు, 287మంది నాన్‌టీచింగ్ స్టాఫ్ సర్క్యులర్‌ను వ్యతిరేకించారన్నారు. సర్క్యులర్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి పరోక్షంగా సహకారంగా ఉంటామని చెప్పారన్నారు. ఓయూ వీసీ ప్రొ.కుమార్ ఒంటెత్తుపోకడ, ప్రభుత్వ కుట్రలో భాగమే సర్క్యులర్ అని దీంతో వర్సిటీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సమావేశంలో ఏబీవీపీ నాయకులు హరిప్రసాద్, కోటి, రాహుల్, చిరంజీవి, నితీశ్ తదితరులు పాల్గొన్నారు.