calender_icon.png 22 March, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడుకుతో కలిసి అల్లుడిని చంపిన మామ

21-03-2025 10:34:46 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కన్నెపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో చదువు లక్ష్మణ్ (33) అనే వ్యక్తిని శుక్రవారం అతని మామ పార్వతి రాజన్న, బావమరిది పార్వతి అనిల్ లు కొట్టి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. మృతుడు లక్ష్మణ్ తన భార్య సమత అలియాస్ రోజాతో గొడవ పడుతుండగా తన కూతురు ని ఎందుకు కొడుతున్నావంటూ మామ రాజన్న, తన కొడుకుతో అనిల్ తో కలిసి కొట్టారు. దీంతో కింద పడ్డ లక్ష్మన్ ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తాండూర్ సీఐ కుమారస్వామి తెలిపారు.