నేను కాంగ్రెస్ నేతను.. మా పార్టీ ఆఫీసుకు వచ్చా: చంద్రశేఖర్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయ క్రాంతి ) : పుష్ప-2 సినిమాకు సంబం ధించి సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కి సలాట ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం.. అల్లు అర్జున్ మధ్య కోల్డ్‌వార్ నడు స్తోంది. మిగతా రాజకీయ పార్టీల నాయ కులు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం గాంధీభవ న్‌కు రావడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసేందుకు చంద్రశేఖర్‌రెడ్డి గాంధీభవన్‌కు వచ్చారు.
ఆ సమయంలోనే దీపాదాస్ మున్షీ, మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మా ట్లాడుతుండగా, చంద్రశేఖర్‌రెడ్డి గాంధీభ వన్‌లోని దీపాదాస్ మున్షీ ఆఫీసులోకి వెళ్లారు. ముందస్తు కార్యక్రమాలకు సంబంధించి దీపాదాస్ మున్షీకి షెడ్యూల్ ఉండటంతో చంద్రశేఖర్‌రెడ్డితో మాట్లాడేందుకు సమయం ఇవ్వలేదు.
దీంతో ఆయన గాంధీభవన్ నుంచి వెనుదిరిగారు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో మాల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ను ఆశించారు. అయితే కాంగ్రెస్ నేతగా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డి గాంధీభవన్‌కు వచ్చినా.. పార్టీ ఇంచార్జ్ మున్షీ మాట్లాడేందుకు సమయం ఇవ్వకపోవడంతో కొత్త చర్చకు దారి తీసింది.
ఒకవైపు అల్లు అర్జున్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగుతున్న క్రమంలో ఈ భేటీతో కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నట్లు అవతుందని గ్రహించే.. దీపాదాస్ మున్షీ చంద్రశేఖర్‌రెడ్డితో మాట్లాడేందుకు సమయం ఇవ్వలేదా..? లేక ముందుస్తు అపాయింట్‌మెంట్ లేకుండా వచ్చారా..?
అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మీడియా ప్రశ్నించగా.. నేను కాంగ్రెస్ పార్టీని వ్యక్తిని.. మ పార్టీకి ఆఫీసుకు వచ్చానని ముక్తసరిగా సమాధానమిస్తూ అక్కడి నుంచి వెళ్లి పోయారు.