హైదరాబాద్: కరీంనగర్(Karimnagar) జిల్లాలోని ముకరంపురలో మామగారి దాడిలో 23 ఏళ్ల యువకుడు గాయపడ్డాడు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ సోయబ్‌కు అజీముద్దీన్ కుమార్తెతో వివాహం జరగడంతో కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం సోయబ్ తన స్నేహితులతో కలిసి అత్తమామ ఇంటిపై దాడి చేశాడు. ఈ ఘటనపై కోపోద్రిక్తుడైన అజీముద్దీన్ కూడా సోయబ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో సోయబ్‌తో పాటు అతని స్నేహితుల్లో ఒకరికి కత్తిపోట్లకు గురయ్యారు. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. కరీంనగర్ టౌన్ పోలీసులు(Karimnagar Town Police) రెండు గ్రూపులపై కేసులు నమోదు చేశారు.