calender_icon.png 17 November, 2024 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తాలేని పశువైద్య శిబిరాలు

17-11-2024 02:06:07 AM

  1. ప్రభుత్వం ఆదేశించినా చర్యలు శూన్యం
  2. ఇబ్బందులు పడుతున్న పాడి రైతులు
  3. 2,210 ఉచిత గర్భకోశ శిబిరాలు ఉత్తమాటేనా?

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి) : రాష్ర్టంలోని పాడి రైతులు పాల ఉత్పత్తిలో గణనీయ ప్రగతిని సాధించారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నా.. వైద్య సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత నెల 25 నుంచి ఫిబ్రవరి 28వరకు ఉచిత పశువైద్య శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించినా అమలు కాలేదు.

పాడి రైతులను ఆదుకునేందుకు పశుసంవర్ధక శాఖకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,980 కోట్లు కేటాయించినా.. హామీలకే పరిమితమయ్యింది. చలికాలంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదని పాడి రైతులు ఆరోపిస్తున్నారు.

కాగా.. పశుసంవర్ధక శాఖ రాష్ట్రీయ గోకుల్ మిషన్, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో, రాష్ర్ట వ్యాప్తంగా మూడు నెలల పాటు అన్ని గ్రామాల్లో 2,210 ఉచిత పశువైద్య గర్భకోశ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఎంపిక చేసిన 300 గ్రామాల్లో కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడల ప్రదర్శన, పాడిపశువులలో పాల దిగుబడి పోటీలు నిర్వహించి అధిక పాల దిగుబడినిచ్చే మేలుజాతి పాడిపశువులపై అవగా హన కార్యక్రమాలు చేపట్ట నున్నట్లు వెల్లడించారు. పాడిరైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికా రులు సూచిస్తున్నారు.