10 June, 2026 | 2:41 AM

సాగు సందిగ్ధం

10-06-2026 01:05 AM
  1. ఎనిమిది రకాల సన్నాలే సాగు చేయాలని ప్రభుత్వం అదేశం
  2. సన్నాల సాగుకే రూ.500 బోనస్ ప్రకటన
  3. సాగుకు రైతుల ముక్కవిరుపు
  4. 10 వేల ఎకరాలు సాగు లక్యంగా రైతులకు అధికారుల ప్రేరణ

కోహెడ, జూన్ 9: సన్నరకాల వరి సాగు పై రైతులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో వ్యవసాయ అధికారులు ప్రభుత్వ అదేశాలతో ఎనమిది రకాల సన్న వరి సాగు విస్తీర్ణం పెంచెందుకు వ్యవసాయ అధికారులు మండల రైతులతో అనుసంధా నమైయారు. గత ఈ నెల 4 నుంచి 10 వరకు మండలంలోని 27 గ్రామలలో విడతల వారిగా గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులను ప్రేరేపిస్తున్నారు. సన్నాల సాగుతో దిగుబడి తక్కవ వస్తుందనే రైతుల మదిలోని సందిగ్ధన్ని తొలగించుటకు గ్రమసభల ద్వార ముమ్మరం అవగాహక కల్పిస్తున్నారు.

కీంటాలుకు రూ.500 బోనస్ చేల్లింపును గుర్తు చేస్తున్నారు. కాగా మండల వ్యాప్తంగా 23 వేలు వరి సాగులో సన్న రకం వరి సాగు 10 వేలు ఎకరాలు తగ్గకుండా రైతులు సాగు చేసే విందంగా మండల వ్యవసాయ యాంత్రంగం తీవ్ర స్థాయిలో కృషి చేస్తుంది.

ప్రభుత్వం కేటాయించిన సన్నాల సాగు రకాలు

ఎనిమిది రకాల సన్నాల రకాలు మాత్ర మే సాగు చేయాలని ప్రభుత్వం ప్రకటించటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. గతంలో పాతిక రకాలకు పైగా సన్నాల సాగు చేసే రైతులకు ప్రభుత్వ నూతన నిబంధన కొంత అసంతృప్తిని కలిగిస్తుందని రైతులలో అందోళన వ్యక్తం అవుతుంది.

ఈ ఎనిమిది రకాల సన్నాల సాగు మాత్రమే చేయాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేయటంతో రైతులు మాత్రం బోనస్ ఎగవేతకు ఎనమిది రకాలను కేటాయించి ప్రభుత్వం కుట్ర చేసిందని విమర్శిస్తున్నారు.

బోనస్ వెయ్యి చెల్లించాలి

సన్నరకం వరి సాగుకు దోమపోటు, తెగులు ఎక్కవగా వస్తాయి. దీంతో లాభం తక్కువగా వస్తుంది. పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. పంట కూడ తక్కువగా వస్తుంది. కాబట్టి క్వింటలు కు 1వేయ్యి రూపాయలు బోనస్ ప్రభుత్వం ఇవ్వాలి.

  గడ్డం కృష్ణారెడ్డి, రైతు కోహెడ.

వానకాలం సాగుకు ప్రభుత్వం అదేశించిన సన్నాల రకాలు:

బీపీటీ-5204 (సంబమసూరి)

జై శ్రీరామ్ హెచ్‌ఎంటీ

వరంగల్  962

వరంగల్-44

జగిత్యాల్-1798

తెలంగాణ సోన (ఆర్‌ఎన్‌ఆర్-15048)

కూనారం-1638 (కేఎన్‌ఆర్)