calender_icon.png 19 October, 2024 | 9:25 AM

చొక్కాలు విప్పించి.. మోకాళ్ల మీద కూర్చోబెట్టి

19-10-2024 12:23:03 AM

విద్యార్థులు హోంవర్క్ చేయలేదని ప్రైవేట్ పాఠశాల నిర్వాకం

మేడ్చల్, అక్టోబర్ 18: హోంవర్క్ చేయలేదని విద్యార్థుల చొక్కాలు విప్పించి, మోకాళ్ల మీద కూర్చోబెట్టిన ప్రైవేట్ పాఠశాల నిర్వాకం మేడ్చల్ మండలంలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.. పూడూరులోని సెయింట్ మేరీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు దసరా సెలవుల్లో హోంవర్క్ ఇచ్చారు.

అయితే, వారిలో కొందరు విద్యార్థులు హోంవర్క్ చేయలేదు. దీంతో శుక్రవారం ఆ విద్యార్థులను తరగతి బయట చొక్కాలు విప్పించి, మోకాళ్ల మీద కూర్చోబెట్టి హోం వర్క్ చేయించారు. విద్యార్థినులను సైతం మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. దీంతో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. చొక్కాలు విప్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.