న్యూజిలాండ్‌పై ఘన విజయం
షార్జా: మహిళల టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఎదురులేకుండా దూసుకెళ్తోంది. మంగళవారం గ్రూప్-ఏలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్రే లియా 60 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.
బెత్ మూనీ (32 బంతుల్లో 40) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఎలిస్ పెర్రీ (30), కెప్టెన్ అలీసా హెలీ (26) నిలకడగా ఆడారు. ఈ ముగ్గురు ఉన్నంతసేపు ఆసీస్ ఓవర్‌కు 8కి పైగా రన్‌రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం. కివీస్ బౌలర్లలో అమెలియా కెర్ 4 వికెట్లతో రాణించగా.. రోస్ మెరి, బ్రూక్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యంతో 19.2 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటై పరాజయం మూటగట్టు కుంది. అమెలియా కెర్ (29 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. సుజి బేట్స్ (20) పర్వాలేదనిపించింది.
ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్, స్కట్ చెరో 3 వికెట్లు పడ గొట్టగా.. సోఫీ 2 వికెట్లు తీసింది. మేఘన్ స్కట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్‌కు మరింత చేరువ కాగా.. న్యూజిలాండ్ ఓడినప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా ఇంకా పోటీలోనే ఉంది.