17-04-2025 12:49:28 AM
తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకుల ఫిర్యాదు
రాజేంద్రనగర్, ఏప్రిల్ 17: అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఓ పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నాయకుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సామా జిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ గౌడ్ మాట్లాడుతూ..
రాజేంద్రనగర్ మండల కేంద్రంలో పర్మిషన్ లేకుండా, సరైన భవన నిర్మాణం కాకుండా ఒక రూమును ముస్తాబు చేసి పిల్లల నుంచి లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుంటున్నటు శివరాంపల్లి లోని గౌతమ్ మోడల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఈఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
దింతో ఎంఈఓ శంకర్ రాథోడ్ తన ఆఫీస్ సిబ్బందిని పంపించి స్కూల్ ను సీజ్ చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం నాయకులు ఆంజనేయులు, సురేష్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.