calender_icon.png 5 April, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతి లేని ఇసుక పట్టివేత

05-04-2025 01:26:54 AM

 చేర్యాల, ఏప్రిల్ 4 అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేసి డంపింగ్ చేస్తున్న ఇసుకను గ్రామస్తులు పట్టుకున్న సంఘటన చేర్యాల పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఆకునూరులో గల పెద్దవాగు నుంచి ఇసుక అక్ర మ దారులు గుట్టు చప్పుడు కాకుండా ఇసు క ను అక్రమంగా తరలించి, ఇష్టానుసారం గా అమ్ముకొని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం  కూడా అదేవిధంగా రవాణా చేసి పట్టణంలో సుందరయ్య నగర్ లో డంపింగ్ చేస్తుండగా విషయం తెలుసుకున్న ఆకునూరి గ్రామస్తులు  రెడ్ హ్యండ్ పట్టుకున్నారు. దీంతో వారిని నిలదీయడంతో నిజం ఒప్పుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దవాగులో ఇసుకను అక్రమంగా తరలించొద్దని రవాణా దారులకు చెప్పినప్పటికీ పెడచెవున పెడుతున్నా రని వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి,  ఇసుకను తరలించకుండా చర్యలు చేపట్టాలని కోరారు.