calender_icon.png 24 January, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతి లేని నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలి

24-01-2025 12:00:00 AM

ఎల్బీనగర్, జనవరి 23 : నగరంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. హయత్ నగర్ లోని నారాయణ పాఠశాలలో ఇటీవల 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, ఈ ఘటనలో పాఠశాలను విద్యాధికారులు సీజ్ చేశారు.

కాగా, నారాయణ పాఠశాలను తిరిగి కొనసాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గురువారం హయత్ నగర్ లోని నారాయణ పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివకుమార్ మాట్లాడుతూ హయాత్ నగర్ నారాయణ పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేకుండా నడిపించడంతో విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారన్నారు.

ఎలాంటి చర్యలు తీసుకోకుండా పాఠశాల నిర్వహణనకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. నిబంధనలు పాటించని పాఠశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సాయి, ప్రణయ్, శ్రీశైలం, సాయి, వేణు, వంశీ తదితరులు పాల్గొన్నారు.