20-02-2025 01:10:24 AM
రామగిరి, ఫిబ్రవరి 19: మండలంలోని బుధవారం పేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలను సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని పదో తరగతి గదులు సిదల వ్యవస్థలో ఉన్న గదులను కలెక్టర్ పరిశీలించారు. గదులు శీతిలవస్తల ఉండడంతో ప్రమాదం పోంచి ఉన్నందున పిల్లలను పక్కనే ఉన్న గదుల్లోకి పంపించాలని సూచించారు.
అలాగే అంగన్వాడి స్కూల్, వన్ ప్రైమరీ స్కూల్ ను పరిశీలించారు. త్వరలోనే పాఠశాలను అభివృద్ధి చేస్తామన్నారు అనంతరం రామగిరి మండలం తాజా మాజీ ఎంపీపీ దేవక్క కొమురయ్య గౌడ్, బుధవారం పేట మాజీ సర్పం బుద్ధార్తి బుచ్చ య్య పటేల్, గ్రామస్తులు కలెక్టర్ తో మాట్లాడుతూ మా ఊరికి మినీ ఆస్పటల్ సాంక్షన్ అయ్యిందని దాని పనులను పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
కాంట్రాక్టర్ కూడా రావడం లేదని, ఎండాకాలం ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉన్నందున వెంటనే మినీ ఆస్పటల్ పనులను ప్రారంభించాలని కలెక్టర్ ను కోరారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు వెంటనే తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.