02-04-2025 12:53:18 AM
కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని త్రీ టౌన్ , మానకొండూరు పోలీస్ స్టేషన్లను మంగళవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఆకస్మిక తనిఖీ చేసారు. పోలీసు స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాదీనంలో ఉన్న వాహనాల వివరాలు అడిగారు. పోలీస్ స్టేషన్ లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు.
వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకున్నారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సిసిటిఎన్‌ఎస్ లో పొందుపరచాలన్నారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేసారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. నమోదైన సైబర్ నేరాల గురించి తెలుసుకున్నారు. అర్బన్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి, మానకొండూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.