సూర్యాపేట: సహుద్యోగి పెట్టె ఇబ్బందులను తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట పట్టణంలోని చంద్రన్నకుంటకు చెందిన వివాహిత కిరణ్మయి(30) జిల్లా కేంద్రంలోని లైన్స్ క్లబ్ లో కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ గా నాలుగు నెలల క్రితం పరీక్ష రాసి ఎంపికైంది.
ఉద్యోగాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో లయన్స్ క్లబ్ లో పనిచేస్తున్న సిబ్బంది పవన్ అనే వ్యక్తి ఆమెను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని, శనివారం ఉదయం ఉద్యోగానికి వచ్చిన తనతో పవన్ తో పాటు తోటి ఉద్యోగులు సైతం దూషించటంతో వేధింపులు తాళలేక శనివారం నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు తెలిపారు. మృతురాలికి భర్త ప్రవీణ్, 8వ తరగతి చదువుతున్న పాప వేదశ్రీ, మూడవ తరగతి చదువుతున్న బాబు కృతిక్ ఉన్నారు. తన భార్య మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ భర్త చేశారు.