calender_icon.png 28 October, 2024 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయంగా ఎదుర్కొనలేక దాడులు

28-10-2024 02:18:59 AM

-మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): కేటీఆర్‌పై బురదజల్లడం లో భాగంగానే ఆయన బావమరిదిపై డ్రగ్స్  కేసంటూ రాష్ర్ట ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని విమర్శించారు. 

రాజ్ పాకాల నివాసంలో ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నదని ముందుగానే ప్రభుత్వ పెద్దలకు తెలుసుని, గత రెండు రోజుల నుంచి మంత్రులు బాంబులు పేలుతాయని అనడం, చెప్పినట్లుగానే ఇళ్లపై దాడులు చేయడం చూస్తే, ముందస్తు ప్రణాళికగా ఇది ప్రభుత్వం రూపొందించిన కుట్రనేని స్పష్టం అవుతోందన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్‌పై దాడిచేసి దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.

కేటీఆర్, ఆయన సతీమణి ఆ ఫ్యామిలీ ఫంక్షన్‌కి వెళ్లకపోయినా వెళ్లినట్టు చిత్రీకరించడంతోనే వక్రబుద్ది బయటపడిందన్నారు. కేటీఆర్ వ్యక్తిత్వాన్ని, ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకొని చీప్ పాలిటిక్స్ చేయడం మానుకోవాలని హెచ్చరించారు.  

ప్రతి ఇంట్లో మందు పార్టీ ఇస్తారు..

తెలంగాణలో శుభకార్యం జరిగితే ప్రతి ఇంట్లో మందు పార్టీ ఇస్తారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు లేవు. కాంగ్రెస్ కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావద్దు.  

 మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్