17-04-2025 02:26:52 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): కొంతమంది నాయకులు అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ జీర్ణించుకోలేకనే వక్రీకరిస్తున్నారని తాజా మాజీ సర్పంచ్ యాదగిరి, అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు. మండల పరిధిలోని ముబారస్ పూర్ అంబేద్కర్ చౌరస్తాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈనెల 13న అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో పట్టుకున్న నీలిరంగు జెండాను పడేసినట్లు కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో పెట్టడం సరైనది కాదన్నారు. జెండా కింద పడలేదని ఎమ్మెల్యే క్యాచ్ వేస్తే కరుణాకర్ పట్టుకున్నాడని దాన్ని ఎడిట్ చేసి కొంతమంది నాయకులు రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు చింతకింది కర్ణాకర్, కోటి కుమార్, రాజు, కిరణ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.