calender_icon.png 10 March, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒత్తిడి తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్యయత్నం

09-03-2025 07:45:49 PM

తిర్యాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విధి నిర్వహణలో ఒత్తిడి తట్టుకోలేక కానిస్టేబుల్ గడ్డి మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ తిర్యాని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిర్యాని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ముద్దసాని పవన్ విధి నిర్వహణలో మెలుకువగా ఉండడంతో కండ్ల మంట తట్టుకోలేక గడ్డి మందు సేవించి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు.

టిఎస్పిఎస్సి విభాగంలో 2024లో ఉద్యోగంలో చేరిన పవన్ స్వస్థలం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం రాజంపేట గ్రామానికి చెందినవాడు. ఆదివారం తాండూర్ ఐబి తిర్యాని గ్రామాల మార్గమధ్యంలో పవన్ కంటి మందు సేవించాడు. సమాచారం తెలుసుకున్న స్నేహితులు హుటాహుటిన మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు ఎస్సై శ్రీకాంత్ తన వాహనంలో తీసుకువెళ్లారు. పవన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడానికి పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.