- భార్యాబిడ్డతో కలిసి గోదావరిలో దూకిన నిజామాబాద్ వాసి
- భార్య క్షేమం.. కూతురు, తండ్రి గల్లంతు
కామారెడ్డి(నిజామాబాద్), నవంబర్ 6 (విజయక్రాంతి): వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక గోదావరి నదిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. నిజామాబాద్‌లోని న్యాల్కల్ రోడ్డులో నివాసం ఉంటున్న వేణు, అనురాధ దంపతులు గత కొద్ది రోజుల క్రితం అవసరం నిమిత్తం వడ్డీ వ్యాపారుల వద్ద రూ.మూడు లక్షల అప్పు తీసుకున్నారు.
వడ్డీతో కలిపి అప్పును చెల్లించారు. అయినా కూడా నగరానికి చెందిన వడ్డీ వ్యాపారులు వికాస్, రోషన్ అధిక వడ్డీ కోసం వేధించడంతో పాటు వేణు కుమార్తె పూర్ణిమను అమానుషంగా తిట్టారు. కలత చెందిన వేణు కుటుంబం నిర్మల్ జిల్లా బాసర వెళ్లి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జాలరులు అనురాధను కాపాడారు. వేణు, అతని కూతురు పూర్ణిమ నదిలో గల్లంతయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. బాసర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.