* యువకుడి ఆత్మహత్య
రామాయంపేట, జనవరి 12: లోన్‌యాప్ వేధింపులు భరించలేక యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఆదివారం జరిగింది. రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామానికి చెందిన చాకలి ప్రశాంత్(24) హైదరాబాద్‌లోని తూంకుంట ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు.
కాగా అతను ఆన్‌లైన్ బెట్టింగుకు బానిసై అప్పులపాలైనట్లు తెలిసింది. అప్పులు తీర్చేందుకు లోన్‌యాప్ ద్వారా కొంత రుణం తీసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కొన్నిరోజుల తర్వాత లోన్‌యాప్ వారు వేధించడంతో ఏం చేయాలో అర్థంగాక ఆదివారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. రామాయంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.