calender_icon.png 18 April, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య

10-04-2025 08:05:40 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన నలిమెల బుచ్చయ్య(57) అనే వ్యక్తి అప్పుల బాధలు భరించలేక గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తాళ్లగురజాల ఎస్సై రమేష్ తెలిపారు. మృతుడు మంచిర్యాలలో వెల్డింగ్ షాప్ పెట్టిన నష్టపోయాడని, కూతురు పెళ్లితో కొంత అప్పులయ్యాడని ఎస్సై రమేష్ తెలిపారు. మృతుని కుమారుడు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.