calender_icon.png 18 March, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

18-03-2025 12:08:45 AM

రామాయంపేట, మార్చి 17ః కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామాయంపేట మండలం దొంగల ధర్మారం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం... ధర్మారం గ్రామానికి చెందిన మాసాయిపేట పురుషోత్తం(34) ఆదివారం రాత్రి అందరు ఇంట్లో భోజనం చేసిన అనంతరం  పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి తిరిగి రాకపోయే సరికి కుటుంబీకులు పొలానికి వెళ్లి అక్కడ వెతకగా పొలంలో ఉన్న చెట్టుకు తాడుతో ఊరి వేసుకొని మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం కోసం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. మృతునికి ఇదివరకు కడుపునొప్పి, ఆర్థిక సమస్యల వలన జీవితంపై విరక్తి చెంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర బాలరాజ్‌తెలిపారు. 

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి..

రామాయంపేట మండలం ఆర్ వెంకటపూర్ గ్రామానికి చెందిన పుర్ర రాములు (36) ఈనెల 11న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగగా తదుపరి అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి సమయంలో మరణించాడు. మృతుడు ఆర్థిక కారణాల వలన జీవితంపై విరక్తి చెంది గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర బాలరాజ్‌తెలిపారు.