calender_icon.png 28 October, 2024 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజా మరణాలపై యూఎన్ చీఫ్ ఆందోళన

28-10-2024 12:00:00 AM

మరణాల సంఖ్య దిగ్భ్రాంతికి గురిచేస్తోందని వ్యాఖ్య

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఇజ్రాయెల్ గత మూడు వారాలుగా ఉత్తర గాజాపై క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో అక్కడ ప్రాణాలు కోల్పోతున్న ప్రజల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుట్టెర్రస్ స్పందించారు. ఉత్తర గాజాలో పెరుగుతున్న మరణాల సంఖ్య తనను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నట్టు ప్రకటించారు.

అంతర్జాతీయ మీడియాకు గాజాలోని మెడికల్ సిబ్బంది ఇచ్చిన సమాచారం ప్రకారం గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ దాడిలో 47 మంది ప్రజలు ప్రాణాలు వదిలారు. ఇందులో 43 మరణాలు ఉత్తర గాజాలోనే నమోదయ్యాయి. మరణించిన వారిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. కాగా.. 2023 నుంచి జరుగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 42, 924 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు లక్షమందికిపైగా గాయాలతో బాధపడుతున్నారు.