‘మనం చేసే పని ఏదైనా కానీ ఒక పదిమందికి ఉపాధి అందిస్తే.. దానికన్నా సంతృప్తి ఏం ఉంటుంది. సైంటిస్టుగా నా పది సంవత్సరాల అనుభవంలో.. ముఖ్యంగా కొవిడ్ సమయంలో చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఉద్యోగం కోల్పోయిన వారు, వ్యాపారాలు మూతపడ్డవారు నా దగ్గరకు వచ్చి సలహాల, సూచనలు తీసుకున్నారు. అలా వాళ్లు పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టారు.
దాని ద్వారా వచ్చే ఆదాయంతో కొవిడ్ సమయంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులను అధికమించారు. ఒక మనిషిగా అంతకన్నా సంతృప్తి ఏం ఉంటుంది’ అని అంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ ప్రమీల. పుట్టగొడుగుల పెంపకం.. దాని లాభాల గురించి 'విజయక్రాంతి'తో పంచుకున్నారామె..
మాది ఖమ్మం జిల్లా. చదువుకున్నది మాత్రం ఖమ్మం, హైదరాబాద్‌లో. ఎన్‌జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్టుగా జాయిన్ అయ్యా. అంతకన్నా ముందు జగిత్యాలలో శాస్త్రవేత్తగా పనిచేశా. వివిధ రకాల పంటలు.. వరి, మొక్కజొన్న, నువ్వులు, పసుపు, వేరు శనగ వంటి వాటిలో పని చేశా.
పుట్టగొడుగు పరిశోధనల్లో గ్రహించింది ఏంటంటే.. చిన్న మొత్తంలో మొదలు పెట్టి.. పెద్దమొత్తంలో సాగు చేయొచ్చని. తక్కువ ఖర్చులో మొదలు పెట్టి.. ఎక్కువ దిగుబడి వచ్చేటట్టు యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంటే అధిక లాభాలు పొంద వచ్చు. తెలంగాణలో వివిధ రకాల పుట్టగొడుగులను సులభంగా సాగు చేసుకోవచ్చు. వాటిలో పది, పన్నెండు పుట్టగొడుగుల రకాలు ఉన్నాయి. వీటి సాగుకు కావాల్సిన వాతావరణం తెలంగాణలో పుష్కలంగా ఉన్నది.
తెలంగాణలో పుట్టగొడుగుల పట్ల అవగాహన ఎలా ఉంది?
తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలతో పొల్చుకుంటే మన రాష్ట్రంలో పుట్టగొడుగులు తెలు సు కానీ వాటి ప్రాముఖ్యత తెలియదు. పుట్టగొడుగుల్లో ఉండే పోష కాలు, ఔషధ లక్షణాల గురించి అవగాహన చాలా తక్కువగా ఉన్నది. మరో విష యం ఏంటంటే.. పుట్టగొడుగులను కొంతమంది మాంసహారంగా భావిస్తారు. కానీ ఇది పూర్తిగా శాకాహారం.
ఎవరైతే పుట్టగొడుగులను సాగు చేస్తున్నా రో.. వాళ్లు ముందు దానిపట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి. మార్కెట్ చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ దీనిపై కొంచెం వర్క్ చేయాలి. ఇప్పుడంతా ఆధునిక టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీని ఉపయోగించు కొని మార్కెట్ చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది పుట్టగొడుగుల పెంపకం.
చాలామంది పుట్ట గొడుగుల పెంపకాన్ని సార్ట్ చేసి ఆపేస్తారు.. ఎందుకంటే దీంట్లో కొన్ని లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. అవి కూడా తెలుసుకోవాలి. అదేంటి అంటే నిరంతరంగా మష్రూమ్స్‌ను మానిటర్ చేసుకోవాలి. సాగు చేసే సమయానికి నాణ్యత కలిగిన విత్తనం దొరకాలి.
అది కూడా ఒక్కోసారి అందుబాటులో ఉండదు. అలాగే పుట్టగొడుగుల నిల్వకాలం తక్కువ కాబట్టి.. ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు దాన్ని లాభాదాయం వచ్చే ప్రొడక్ట్స్‌లాగా మార్చుకొని తక్కువ ధరకు అమ్ముకుంటే సరిపోతుంది. ఇన్నీ జాగ్రత్తలు పాటి స్తూ.. ప్లాన్ చేసుకుంటే పుట్టగొడుగుల పెంపకం లాభదాయకంగా ఉంటుంది.
మష్రూమ్స్ యూనిట్ పెట్టాలి అంటే ఏముండాలి?
పుట్టగొడుగుల పెంపకం చేపట్టాలి అంటే మొదట క్లోస్డ్ రూమ్స్ అవసరం. ఈ క్లోస్డ్ రూమ్స్ కూడా సొంతంగా కట్టుకుంటే పది లక్షల దాకా అవుతుంది. దానికంటే బొగ్గులతో కానీ, వెదురు చాపలతో గదులను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే ఒక 50 వేలల్లో పూర్తి అవుతుంది. మన రాష్ట్రంలో సాగు చేసుకునేటప్పుడు మాత్రం భూమిలో ఒక రెండు అడుగుల లోతు తీసుకోని సాగు చేయాలి. ఎందుకంటే గాలిలో తేమ అనేది పుట్టగొడుగులు పెరగడానికి చాలా అవసరం.
సాధారణ మహిళలు ఇంటి నుంచే బిజినెస్ చేసుకోవచ్చా?
మహిళలు దీన్ని చిన్న మోతాదులో ఆదాయం వచ్చే బిజినెస్‌గా సార్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగంటే కిచెన్ గార్డెన్ మాదిరి. మిద్దెమీద చిన్న రూమ్ వేసి పుట్టగొడుగులను సాగు చేసుకోవచ్చు. దీనికోసం ఒక ఐదువేలు పెట్టి.. కవర్లు, విత్తనం, గడ్డిని తెచ్చుకొని సాగు చేసుకోవచ్చు. అలాగే అపార్ట్‌మెంట్‌లో ఇండోర్‌గా కల్టీవేట్ చేసుకోవడానికి రెడిమేడ్ బ్యాగ్స్ కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. దానికోసం ఒక 25 రోజులు బ్యాగ్స్‌ను బాగా డెవలప్ చేసి పుట్టగొడుగులను సాగు చేసుకోవచ్చు.
ప్రభుత్వం నుంచి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి? ఎలాంటి ప్రోత్సహం లభిస్తుంది?
తెలంగాణలో ఇదే సమస్య ఎక్కువగా ఉన్నది. మనదేశంలో జాతీయ స్థాయిలో ‘నేషనల్ హార్టికల్చర్ బోర్డు’లో స్కీమ్స్ ఉన్నాయి. పుట్టగొడుగుల పెంపకానికి కొన్ని సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి. అవి కేవలం ఉత్తర భారతదేశంలో సాగు చేసుకునే వారికి మాత్రమే లభ్యం అవుతున్నాయి.
మన దగ్గరికి వచ్చే సరికి.. అగ్రికల్చర్‌కు సంబంధించిన బ్యాంకులు ‘నా బార్డు’ వంటివి ఆధారాలు, గుర్తింపు మీదనే లోన్స్ ఇస్తున్నాయి. ఇప్పటీ వరకు సబ్సిడీలు అనేవి పుట్టగొడుగుల పెంపకంలో లేవు. చాలామంది అడుగు తున్నారు. ఇప్పుడు అది కూడా ప్రభుత్వం అమలు చేస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది.
ఎందుకంటే ముఖ్యంగా మహిళలు, ఉద్యోగం లేని యువతకు చిన్నమోతాదులో చాలా లాభదాయకంగా ఉంటుం ది. ఇంకా పుట్టగొడుగుల్లో ఫ్రెష్ మష్రూమ్స్ మాత్ర మే కాకుండా విత్తనాన్ని కూడా ఎంటర్‌ప్రైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే మైక్రోబయాలజీ, పాన్‌పథాలజీ లేదా డిగ్రీ విద్యార్థులు కూడా దీన్ని నేర్చుకుని విత్తనం తయారు చేయడం కూడా చేపట్టవచ్చు.
పుట్టగొడుగుల బిజినెస్‌కు మార్కెట్ ఎలా ఉంది?
మష్రూమ్స్ అనేది కాస్లీ డైట్. ఎందుకంటే పెచ్చి, అమ్మడానికి అయ్యే ఖర్చు దీంట్లో తీసుకుంటారు. మనం ఎప్పుడైతే ఉత్పత్తి పెంచుతామో.. అప్పుడు దాని ధర తగ్గే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో ఐటమ్ ఎక్కువ లభ్యం అయితే.. దాని ధర కూడా తక్కువగా ఉంటుంది. ముందుగా ఉత్పత్తి పెంచితే సరిపోతుంది. అలాగే ప్రజల్లో పుట్టగొడుగుల వల్ల లాభాలు, వాటిలో ఉండే పోషకాల గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
ఇవి అచ్చమైన శాకాహారం..
పుట్టగొడుగులు అచ్చమైన శాకాహారం. అయినా మాంసాహారంలో ఎక్కువగా ఉండే బి12తో పాటు విటమిన్ బి, నియాసిన్ వంటి విటమిన్లు.. కాల్షియం, సెలీనియం, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. బి12 విటమిన్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. క్యాన్స ర్‌ను నయం కూడా చేస్తుంది.
పుట్టగొడుగులను క్రమం తప్పకుండా తింటే చర్మ సమ స్యలు రావు, బీపీ నియంత్రణలో ఉంటుంది. పీచు పుష్కలంగా ఉండటం వల్ల ఊబకాయాన్ని తగ్గించడంలోనూ సహాయపడు తుంది. ఎండబెట్టిన పుట్టగొడుగుల పొడితో జావ చేసుకొని తాగినా, ఎండబెట్టిన పుట్టగొడుగులను నానబెట్టుకొని వండుకొని తిన్నా మిటమిన్ డి లోపం తగ్గుతుంది.
రూప