calender_icon.png 26 February, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోండ్రియాలలో ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

26-02-2025 01:21:02 PM

రెండవ ఉత్తర కాశిగా పిలవబడుతున్న ఆలయం 

ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో మొదటి శివాలయం

భక్తులతో కిటకిటలడిన దేవాలయ ప్రాంగణం

కోదాడ,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియల గ్రామంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేదమంత్రాల సాక్షిగా  అంగరంగ వైభవంగా జరిగాయి. శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండే  భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలులడింది. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ ఏటుకూరి రమేష్ మాట్లాడుతూ.. ఉత్తర కాశీలో తూర్పున నది ప్రవహిస్తున్నట్లు. ఉమామహేశ్వర శివాలయానికి ఉత్తరాన పాలేరు వాగు ప్రవహిస్తూ ఉండడంతో ఈ ఆలయానికి రెండవ ఉత్తర కాశిగా పిలువబడుతుందని తెలిపారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో మొదటి దేవాలయంగా పేరుందని తెలిపారు. శివపార్వతుల కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో.. దేవాలయ ఈవో చలపతి, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.