27-02-2025 07:47:06 PM
పార్టీకి తీరనిలోటు గన్న నరసింహారావు
మునగాల,(విజయక్రాంతి): మందపల్లి ఉమామహేశ్వరరావు(Mandapalli Umamaheshwara Rao) అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరంలోటు గన్నా నర్సిరావు(Ganna Narasimha Rao) అన్నారు. మునగాల మండల పరిధిలోని కలు కోవా గ్రామానికి చెందిన మందపల్లి ఉమామహేశ్వరరావు కొంతకాలంగా కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీలో నివాసం ఉంటూ జీవితం కొనసాగిస్తున్నాడు. బుధవారం కోదాడపట్టణంలోని, లక్ష్మీపురం కాలనీలో మందపల్లి ఉమామహేశ్వరరావు, అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. కలకోవ గ్రామానికి చెందిన,కాంగ్రెస్ పార్టీనాయకులు, పార్టీగ్రామశాఖ ఆధ్వర్యంలో వారిపార్థివదేహానికి కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు గన్నా నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పనస శంకర్ లు మాట్లాడుతూ... మందపల్లి ఉమామహేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉంటూ కలకోవ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా మంచి గుర్తింపు ఉందన్నారు.
అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి గ్రామశాఖ అధ్యక్షుడిగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వివిధ హోదాలలో వారు పార్టీ కోసం పని చేశారు. కోదాడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎన్. ఉత్తమ్ పద్మావతి రెడ్డి గెలుపు కోసం కలకోవ గ్రామంలో ప్రతి గడప గడపకు తిరిగి ప్రచారం చేసి గెలుపులో భాగస్వామ్యమయ్యారన్నారు. మందపల్లి ఉమామహేశ్వరరావు, పార్టీకోసం పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని చెప్పారు. ఇప్పుడు ఆయన లేనిపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో కన్ను మూయడంతో విషాద వాతావరణం అలుముకుంది. వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పనస శంకర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గన్నా నరసింహారావు, మాజీ సొసైటీ డైరెక్టర్ దొంగరి మోహన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగరి అప్పారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్దుల వీరయ్య, జూకూరి వసంతరావు, తదితరులు పాల్గొన్నారు.