28-04-2025 01:28:24 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): శ్రీ మహాత్మా బసవేశ్వర 892 జయంతి ఉత్సవాలు కమిటీ సభ్యుడుగా నారాయణగూడ చెందిన ఎస్.ఉమామహేశ్వర్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం రాష్ర్ట వీర శైవ లింగాయత్ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులుగా వ్యవహరి స్తున్నారు.
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన బుధవారం నాంపల్లి రవీంద్ర భారతి లో భారీ ఎత్తున ఉత్సవాలు జరగనున్నాయి, రా ష్ర్ట ఉత్సవ కమిటీ చైర్మన్ గా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కర్ నేతృత్వంలో రాష్ర్ట ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది,ఈ కమిటీ సభ్యుడిగా ఉమా శంకర్ నియమించడం పట్ల బీసీ సంఘాల నాయకులు ఆర్,కె, ప్రసాద్ డాక్టర్ బి. లక్ష్మయ్య, జంగం స మాజం కార్యదర్శి మడపతి రామలింగరాజు. కోశాధికారి గుంటి జగదీశ్వర్ తది తరులు హర్షం వ్యక్తం చేశారు.
బసవ జ యంతి ఉత్సవ కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పించిన సందర్భంగా ఉమామ హేశ్వర్ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, .చైర్మన్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.